రామ మందిరం నిర్మించిన కార్మికులపై పూలు చల్లిన ప్రధాని మోడీ (వీడియో వైరల్)

by Shiva |
రామ మందిరం నిర్మించిన కార్మికులపై పూలు చల్లిన ప్రధాని మోడీ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ నిత్య నిరాడంబరుడు. ఆయన ఏది చేసినా.. వినూత్నంగానే ఉంటుంది. ఒక్కోసారి ఆయన చేసే పనులు దేశ పరువు, ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఎందుకంటే ఆయన కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడే కనుక. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశంలో హిందువులు గర్వంగా ఫీలయ్యేలా వైభవోపేతంగా జరిగింది. ప్రాణ ప్రతిష్ట క్రతువును ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పండితులు వేదమంత్రాల నడుమ జరిపించారు. అనంతరం ఆలయం బయటకు వచ్చి ప్రధాని ఆయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం స్వయంగా బుట్ట చేతబట్టుకుని వారిపై పూలు చల్లుతూ ముందుకుసాగారు. దీంతో అక్కడున్న వారు ఆ దృశ్యాలను చూసి చలించిపోయారు. సామాన్యులపై ప్రధాని చూపిస్తున్న ప్రేమ, అప్యాయతను పలువురు ముగ్ధులయ్యారు.

కాగా, గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన కుంభమేళా కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించింది. ఆ సందర్భంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశుధ్య కార్మికులు లేనిదే అంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అసాధ్యమని వారి సేవలను కొనియాడారు. ఆ తరువాత రాష్ట్రంలో పర్యటించి పవిత్ర గంగా స్నానం ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అక్కడున్న పారిశుధ్య కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి పాదాలను కడిగి, శుభ్రంగా తుడిచి శాలువాలను కప్పి సత్కరించారు. దేశాన్ని శుభ్రంగా ఉంచేందుకు వారు పడుతున్న తపన అభినందనీయమని కొనియాడారు.

Next Story

Most Viewed