యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక నష్టం రూ. 1388 కోట్లు!

by  |
యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక నష్టం రూ. 1388 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి యాక్సిస్ బ్యాంక్ నికరంగా రూ. 1,387.78 కోట్ల నష్టాలను వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 1505 కోట్ల నికర లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఈ త్రైమాసికంలో మొండి బకాయిలకు అధికంగా కేటాయింపులు జరగడం వల్ల నష్టాలు తప్పలేదని సంస్థ ప్రకటించింది. అలాగే, మొత్తం ఆదాయం రూ. 18,324.31 కోట్ల నుంచి రూ. 20,219.57 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ వివరించింది. మొండి బకాయిలతో పాటు ఇతర అవసరాల కోసం రూ. 7,730 కోట్లను కేటాయించామని, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 2711 కోట్లను మాత్రమే కేటాయించామని తెలిపింది. ఏకీకృత ప్రాతిపదికన మార్చితో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ. 1250 కోట్ల నికర నష్టాలను చూసిందని పేర్కొంది. ఆదాయం రూ. 20,786.23 కోట్లుగా నమోదైనట్టు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ. 1677.90 కోట్ల నికర లాభాన్ని, రూ. 18,950.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు, స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 5.26 శాతం నుంచి 4.86 శాతానికి, అలాగే, నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2.06 శాతం నుంచి 1.56 శాతానికి తగ్గినట్టు బ్యాంక్ వెల్లడించింది.

Tags: axis bank, q4 results, Q4 earnings, Axis Bank results

Next Story

Most Viewed