పండుగ పూట పస్తులుండేలా చేశారు: అచ్చెన్నాయుడు

36

దిశ, వెబ్‌డెస్క్ : రైతు వ్యతిరేక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. 19 నెలల పాలనలో సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల వినాశానికి జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని.. విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. చివరకు పండుగ పూట రైతులను పస్తులుండేలా చేశారని విమర్శించారు.