ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా స్పిన్ మాంత్రికుడు

by  |
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా స్పిన్ మాంత్రికుడు
X

దిశ వెబ్‌డెస్క్: టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను దక్కించుకున్నాడు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తోంది. జనవరి నెలకు రిషబ్ పంత్ అవార్డును అందుకోగా.. ఇలా తొలి రెండు అవార్డులను భారత క్రికెటర్లు అందుకోవడం విశేషమని చెప్పవచ్చు.

ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించి అశ్విన్ ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరిచాడు. సిరీస్‌ మొత్తంలో 189 పరుగులు చేసిన అశ్విన్.. 32 వికెట్లు తీశాడు. తన అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సీరిస్‌ను గెలుచుకున్న అశ్విన్.. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా గెలుచుకోవడంపై టీమిండియా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 400 వికెట్ల మార్క్‌కి చేరుకున్న అశ్విన్.. తక్కువ సమయంలో ఆ ఫీట్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో అత్యంత వేగంగా, తక్కువ సమయంలో 400 వికెట్ల తీసి తొలి స్థానంలో ఉన్నాడు.



Next Story

Most Viewed