2021కి ఆసియాకప్ వాయిదా: ఏసీసీ

by  |
2021కి ఆసియాకప్ వాయిదా: ఏసీసీ
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా టీ20 కప్‌ను ఏడాదిపాటు వాయిదా వేస్తున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదికి ఆసియాకప్ రద్దయినట్లు బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ఏసీసీ టోర్నీపై తుది నిర్ణయం తీసుకుంది. ‘షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్ నిర్వహించడానికి ఏసీసీ అన్నిరకాల ప్రయత్నాలు చేసింది. కరోనా కారణంగా పలు దేశాల్లో క్వారంటైన్ నిబంధనలు, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సవాలుగా మారింది. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది, కమర్షియల్ పార్ట్‌నర్స్, అభిమానులు, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని టోర్నీ వాయిదా వేయడమే ఉత్తమం అనిపించింది. వారి ప్రాణాలను రక్షించడం తమ బాధ్యత అని భావించింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక వేదికగా 2021, జూన్‌లో టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఆసియాకప్ కోసం ఐసీసీ ఎఫ్‌టీపీలో సమయం కోసం ప్రయత్నాలు చేస్తాం’ అని ఏసీసీ తమ ప్రకటనలో వెల్లడించింది.

Next Story