ఉమెన్స్ డే స్పెషల్: ‘ఆమె’ కాంప్రమైజ్ కావొద్దు!

by  |
ఉమెన్స్ డే స్పెషల్: ‘ఆమె’ కాంప్రమైజ్ కావొద్దు!
X

దిశ, ఫీచర్స్ : సృష్టికి మూలమైన ‘ఆమె’ యుగయుగాలుగా తన పట్ల సమాజం చూపుతున్న వివక్షపై పోరాడుతూనే ఉంది. మోడ్రన్ ఆదిశక్తిలా అవతరించి, సమానత్వం కోసం ఆరాటపడుతూ అస్థిత్వాన్ని చాటుకుంటోంది. సొసైటీ కట్టుబాట్లను అధిగమించి అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం వరకు విజయ పతాకను ఎగురవేస్తోంది. అయినా ఇంకా ఎక్కడోచోట వారిపై పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి. రంగు, చర్మం నుంచి మొదలుకుని.. ఎలా ఉండాలి? ఎలా కనిపించాలి? ఎలా బిహేవ్ చేయాలి? అనే అంశాలపై హద్దులు గీసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళలపై విధించబడుతున్న అహేతుకమైన హద్దులను చెరిపేసేందుకు ఐటీసీ సంస్థ ప్రయత్నిస్తోంది. సంస్కృతి లేదా ఇతర కట్టుబాట్ల ముసుగుతో మహిళలను వంటింటికే పరిమితం చేసే చర్యలను ఐటీసీ వివెల్(ITC’s Vivel) స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా చాలెంజ్ చేస్తోంది. సమాజంలో పేర్కొనబడే అన్‌రియలిస్టిక్ స్టాండర్డ్స్ వల్ల మహిళలు తమలో తాము బాధపడుతున్నారని, అది సబబు కాదని వివరిస్తోంది. మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తూ, సొసైటీ నార్మ్స్‌తో కాంప్రమైజ్ కావొద్దని, తమ శక్తిని అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దని రెక్కలు విప్పుకుని పట్టుదలతో తమ లక్ష్యాలు సాధించేందుకు ప్రయత్నించాలని సూచిస్తోంది. ‘అబ్ సంఝౌతా నహీ (No More Compromise)’ అనే సందేశంతో క్యాంపెయిన్ షురూ చేసింది.

బీ కంఫర్టబుల్ ఇన్ స్కిన్..

తమ చర్మం సరిగా లేదని మహిళలు బాధపడొద్దని, తమని తాము ప్రేమించుకోవాలని (సెల్ఫ్ లవ్) గుర్తు చేస్తోంది ఈ క్యాంపెయిన్. అమెరికన్ ఫేమస్ యాక్ట్రెస్ జెన్నిఫర్ లోపెజ్ నుంచి గోవా బ్యూటీ ఇలియానా వరకు పలువురు సెలబ్రిటీలు సెల్ఫ్ లవ్ ఇంపార్టెన్స్ గురించి చాలా సార్లు చెప్పారు. కలర్, ఇతర ఇన్ఫిరియారిటీస్‌తో బాధపడ్డ ఫేమస్ ఉమెన్ సెలబ్రిటీలు సైతం ఆ తర్వాత కాలంలో వాటిని అధిగమించారు. తాను అందంగా ఉన్నప్పటికీ అద్దంలో చూసుకున్నపుడు శరీరంలో ఏదో లోపం ఉందని అంసతృప్తికి గురయ్యేదాన్నని, దీన్నే ‘బాడీ డిస్‌మార్ఫియా’ అంటారని ఇటీవలే నటి ఇలియానా పేర్కొన్న సంగతి విదితమే. అయితే నెగెటివిటీ పక్కనపెట్టి తనను తాను ప్రేమించుకోవడం మొదలు పెట్టాక, నిర్మల మనసుతో తనను తాను చూసుకోవడం ద్వారా పాజిటివ్‌ వైబ్స్‌తో మందుకు సాగానని పేర్కొంది ఈ గోవా బ్యూటీ. కాగా మహిళలు బాడీ షేమింగ్ ప్రాబ్లమ్‌ను ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. ఇంటి దగ్గర నుంచే మొదలైన ఈ కల్చర్‌ సొసైటీలో భాగమై పీడిస్తోంది. మహిళలు ఈ విషయంలో అవమానాలు, వేధింపులకు గురై మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషపూరితమైన క్రిటిసిజంను ఆపేందుకు వివెల్ క్యాంపెయిన్ తనదైన స్థాయిలో కృషి చేస్తోంది.

బీ ఏ పార్ట్ ఆఫ్ చేంజ్..

మనం అనుకున్నది ఏదైనా చేయగలిగే ఏకైక ప్రపంచం ‘కళ(ఆర్ట్)’. కళ ద్వారా నిద్రాణమైన సమాజాన్ని తట్టి లేపి, చైతన్యపు మార్గంలో నడిపించొచ్చు. మరీ ముఖ్యంగా అతివల ఉత్సాహాన్ని నీరుగార్చే సమాజపు పోకడలను దునుమాడొచ్చు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని, తమలో తాము కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అలాంటి ఆర్ట్ వర్క్స్ మీరు గీయగలిగితే వాటిని తమకు పంపండని కోరుతోంది ఐటీసీ. @vivlbyitc ఇన్‌స్టా ఐడీకి #VoiceOfArt, #AbSamjhautaNahin హ్యాష్ ట్యాగ్స్ ద్వారా పంపాలని పౌరులతో పాటు ఆర్టిస్టులను కోరింది. ఆర్ట్ వర్క్స్ ద్వారా ప్రతీ ఒక్క ఇండివిడ్యువల్ సామర్థ్యంగల వారేనని, మహిళలు సమాజ కట్టుబాట్లతో కాంప్రమైజ్ కావొద్దని చెప్పడమే ‘ద వాయిస్ ఆఫ్ ఆర్ట్ 2.0(The Voice Of Art 2.0)’ క్యాంపెయిన్ లక్ష్యం. కాగా దేశంలోని ఆర్టిస్టులు, మహిళా సాధికారతను సూచించే ఆర్ట్ వర్క్స్ డ్రా చేసి తమ వంతు పాత్ర పోషించాలని ఐటీసీ కోరింది.

లింగ వివక్షను సవాల్ చేస్తూ ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్లు ఐటీసీ నిర్వాహకులు తెలిపారు. ఐటీసీ ప్రొడక్ట్ వివెల్(Vivel)లోని తొలి అక్షరం వి(V) అంటే ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ అని తెలిపారు. మహిళలు పరిస్థితులకు తలొగ్గి కాంప్రమైజ్ కావొద్దని సూచించేందుకు, సెల్ఫ్ లవ్, కాన్ఫిడెన్స్‌తో ఆకాశమే హద్దుగా విహరించాలని కోరారు. సొసైటీ‌లో ప్రివేల్ అయిన జెండర్ బేసిస్ వివక్ష ఇక మోడ్రన్ టైమ్స్‌లో ఉండబోదని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ఈ క్యాంపెయిన్ ప్రారంభం కాగా, రంగు, స్థాయి, అందం లేకపోయినా మహిళలు పరిపూర్ణమే అనే సందేశాన్ని సమాజానికి ఇస్తోంది. మహిళ అందం బాహ్యప్రపంచానికి కనబడేది మాత్రమే కాదని ఇంటర్నల్‌(ఇన్‌సైడ్) థాట్స్ కూడా బ్యూటీయేనని చెప్పడం ఈ క్యాంపెయిన్ ఉద్దేశం. ఈ క్యాంపెయిన్ ద్వారా లింగ వివక్ష లేని సమాజానికి అడుగులు పడాలని.. రంగు, చర్మం, ఇతర ఇన్ఫీరియారిటీ డిజార్డర్స్ అసలు ఇబ్బందులే కావని, తాము తలచుకుంటే అన్నీ సాధించగలమని భావించాలని ఆశిద్దాం.



Next Story