పకడ్బందీగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

by  |
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
X

దిశ, సంగారెడ్డి : జిల్లాలోని 54 పరీక్ష కేంద్రాలలో 16,255 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందరామ్ తెలిపారు. శనివారం నాడు ఆయన తన కార్యాలయంలో “దిశ “తో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు కొవిడ్ నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యగా ప్రతి పరీక్ష కేంద్రంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి సెంటర్‌లో ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ. ఎన్ .ఎం లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు విధిగా మాస్కులు ధరించి, శానిటై జర్ తో పాటు ఎవరి వాటర్ బాటిల్ వారు వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో అన్ని జాగ్రత్తలతో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 16,255 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అందులో 1287 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఉండగా, 14968 మంది విద్యార్థులు మిగతా వారు ఉన్నారన్నారు.



Next Story

Most Viewed