అరణ్యగా రానా.. అడవితో దోస్తానా!

by  |
అరణ్యగా రానా.. అడవితో దోస్తానా!
X

రానా… అరణ్య టీజర్ వచ్చేసింది. హిందీలో హాథీ మేరి సాతి, తమిళ్‌లో కాదన్‌గా బుధవారమే టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అడవికి నష్టం కలిగితే ఆదివాసీ… ఎలాంటి పోరాటం చేశాడు? అడవిని, జంతువులను ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. కాగా ఈ సినిమాలో రానా 50 ఏళ్లున్న వ్యక్తిగా కనిపిస్తూ న్యాయపోరాటం చేయనున్నాడు.

తెలుగులో టీజర్ రిలీజ్ చేసిన రానా అరణ్య సినిమాతో ఒక మనిషిగా, యాక్టర్‌గా చాలా నేర్చుకున్నానని చెప్పాడు. 150 రోజులు సెల్‌ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కేవలం అడవులు, చెట్లతో సావాసం చేస్తూ సుఖంగా ఉన్నానని తెలిపాడు. సినిమాలో అరణ్యగా, బన్‌దేవ్‌గా క్యారెక్టర్ సెట్ అయ్యేందుకు చాలారోజులు పట్టిందన్నారు రానా. ఆరు, ఏడు అడవుల్లో షూట్ చేశామని, చివరికి థాయ్‌లాండ్ అడవుల్లో క్యారెక్టర్ సెట్ అయిందని చెప్పారు. యదార్థ అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మూడు భాషల్లో చేశామని, నార్త్, సౌత్ భేదం ఉంటుంది కాబట్టి, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో ఒకే సీన్, ఒకే ఫైట్‌ను రెండు, మూడుసార్లు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు చేసిన సినిమాల ద్వారా సినిమా అంటే ఏంటో అర్థమైతే… ఈ సినిమాతో దర్శకులు ప్రభు సోలోమన్ వల్ల లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నానని చెప్పారు. జాదవ్ పియాంగ్ అనే వ్యక్తి 1,400 ఎకరాలు అడవిని నాటి .. అందులో పులులు, ఏనుగులు వచ్చి నివాసం ఉండేంత గొప్పగా తీర్చిదిద్దాడు. అలా చేయకపోయినా సరే జంతువుల జీవనానికి అడ్డుపడకుండా నడుచుకుంటే చాలు అని అనిపించిందన్నారు. ఎందుకంటే మానవుడు జంతుజాలాన్ని అడ్డుకుంటే ఎంతటి పరిణామాలు ఉంటాయో సినిమా ద్వారా అవగాహన కలుగుతుందని తెలిపారు.

Next Story

Most Viewed