అరకు టు ఆగ్రా.. గంజాయి వ్యాపారం

by  |
CP Mahesh Bhagwat
X

దిశ, క్రైమ్ బ్యూరో : లారీ క్యాబిన్‌లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాదవ్ (35) ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే లారీలను ఎంచుకుంటారు. లారీ డ్రైవర్లతో కుమ్మక్కై, వారి సీటు వెనుకాల క్యాబిన్ లో గంజాయిని దాచి విశాఖపట్నం అరకు ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు తరలిస్తున్నారు. అరకులో కిలో రూ.3 వేలకు కొనుగోలు చేసి, ఆగ్రాలో రూ.10 వేలకు విక్రయిస్తూ అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నాడు.

ఇలా మూడేళ్లుగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న యాదవ్‌కు.. రాజస్థాన్ కు చెందిన దేవేందర్ సింగ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రవీంద్రకుమార్ పండిట్ లు పరిచయం అయ్యారు. వీరుంతా అరకు ప్రాంతానికి చెందిన హరితో రెగ్యులర్ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్‌బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు స్థానిక హయత్ నగర్ పోలీసులతో కలిసి బుధవారం ఉదయం కాపుగాసి పట్టుకున్నారు.

ఈ సందర్భంగా దేవేందర్ సింగ్, రవీంద్రకుమార్ పండిట్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు రూ.40 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి, లారీ, రూ.15 వేల నగదు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదుకు చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎల్‌బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఎస్ఓటీ ఎస్పీ సురేందర్ రెడ్డి, ఎల్‌బీ నగర్ జోన్ ఎస్ఓటీ ఇన్ స్పెక్టర్ టి.రవికుమార్, ఎస్ఐలు అవినాష్ బాబు, హయత్ నగర్ ఇన్ స్పెక్టర్లు సురేందర్ లను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.



Next Story

Most Viewed