ఏపీలో రోడ్డెక్కనున్న 350 ఎలక్ట్రిక్‌ బస్సులు

by  |
ఏపీలో రోడ్డెక్కనున్న 350 ఎలక్ట్రిక్‌ బస్సులు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీఎస్ ఆర్టీసీలో కొత్తగా 350 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ బస్సు ధర రూ.2 కోట్ల నుంచి రూ.1.75 కోట్లకు తగ్గిందని అన్నారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపిన తర్వాతే ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్‌పై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక్కరికే టెండర్ కట్టబెట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈనెల 23 తర్వాత అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని మంత్రి నాని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో అందరికీ సరిపడేలా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు కేటాయించాలని పేర్నినాని కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీని ప్రత్యేకంగా చూసి, ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు మంత్రి నాని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో నిరుద్యోగ యువతకు మంచి జరుగుతుందని…ముందుగా చెప్పినట్లుగా అన్ని ఖాళీ ఉద్యోగాలను సీఎం భర్తీ చేసి ఇచ్చిన హామీని నిలుపుకొంటారని మంత్రి నాని వెల్లడించారు.

Next Story