పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ?

by  |
పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ?
X

దిశ, వెబ్ డెస్క్ : పుస్తకం మూడక్షరాలే అయినా ఎంతో మంది కలలకు ఆధారం, సామాన్యుని ఆయుధం పుస్తకం. చిరిగిన చొక్కానైనా తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కొమ్మన్నాడు గురజాడ అప్పరావు. ఒక మంచి పుస్తకం వేయిమంది మిత్రులతో సమానమని అన్నారు మరో మహాను భావుడు. అలా ఎందరో మహానుభావులు పుస్తకం విషిష్టతను తెలియజేశారు. అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకున్ని తనలో లీనం చేసుకునేది పుస్తకం. ఒంటరితనంలో తోడుగా ఉండే ఓ మంచి స్నేహితుడు పుస్తకం.

ఉదయాన్నే ఛాయ్ తాగినప్పుడు మొదటి చప్పురింపు ఎంత హాయిని ఇస్తుందో పుస్తకం అంత హాయ్ ని స్తుందని అంటారు కొంత మంది . అలా అన్నింటిని మరిపించి విజ్ఞానాన్ని అందించేది విజ్ఞాన భాంఢాగారం పుస్తకం. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి, ఎంతో మంది జీవితాలు వారి ఎదుర్కొన్న కష్టాలను అక్షర రూపంలో మనకు అందించి, ధైర్యాన్ని ఇస్తుంది పుస్తకం. అంబేడ్కర్ అన్నారు.. నా భార్య బిడ్డలకన్న పుస్తకమే నాకు ఎక్కువ.. నాప్రాణం పుస్తకం అని ఆ కాలంలో పుస్తకాలకి అంత విలువనిచ్చేవారు. కానీ ప్రస్తుత తరం పుస్తకాలను చదవడం మానేసి టీవీలు, వీడియో గేమ్ లు ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ కాలం గడుపుతున్నారు. పుస్తకాలను మ్యూజియంలో పెట్టుకొని చూడటం తప్పితే చదవడానికి ఆసక్తి చూపడం లేరు.

పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు..

ఏప్రిల్ 23 పుస్తక దినోత్సవం. ఈ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా పరిగణించడంపై విభిన్న కథనాలున్నాయి. 17వ శతాబ్దంనాటి యూరప్‌లో ఈ రోజును సెయింట్ జార్జ్ డే గా పాటించేవారు. స్పెయిన్ లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఒక కారణం. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది. 2017 సంవత్సరానికి గానూ రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని ‘కొనాక్రీ’ సిటీని, 2018 సంవత్సరానికి గానూ గ్రీస్‌లోని ‘ఏథెన్స్‌’ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. 2019 సంవత్సరానికి కూడా దరఖాస్తులు చేస్కోవాల్సిందిగా తాజా ప్రకటన చేసింది యునెస్కో.



Next Story

Most Viewed