ఏపీలో లాక్‌డౌన్ నుంచి విముక్తి వీటికే…!

by  |
ఏపీలో లాక్‌డౌన్ నుంచి విముక్తి వీటికే…!
X

ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన మే 3వ తేదీ సమీపిస్తున్న కొద్దీ లాక్ డౌన్ సడలింపు లభిస్తుందని అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో నానాటికీ కేసులు పురోగతి గణనీయంగా ఉంది. అంతేకాకుండా ఏపీలోని 13 జిల్లాలకు 12 జిల్లాలు కరోనా బారినపడ్డవే.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెడ్ జోన్‌లో ఉన్నవే. దీంతో ఏపీలో లాక్‌డౌన్ సడలించే అవకాశం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో సమావేశం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పలు రంగాలకు లాక్‌డౌన్ నుంచి విముక్తి లభించనుంది. ఆ రంగాల వివరాల్లోకి వెళ్తే…

1) ఆర్థిక రంగం
2) వ్యవసాయం రంగం, ఉద్యాన పనులకు
3) ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్
4) గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు
5) పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు
6) ఈ-కామర్స్ కంపెనీలు, వారి వాహనాలకు
7) ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలు తెరిచేందుకు
8) వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలోని సొంతూరులో పనిచేసుకోవచ్చు ( ‘కరోనా’
లక్షణాలు లేనివారికి మాత్రమే)
9) మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి లభించింది.

tags: lockdown, freedom, ap, central home minister, amit shah


Next Story

Most Viewed