ఏపీ పీజీసెట్ పరీక్షా ఫలితాలు విడుదల..

by  |
ఏపీ పీజీసెట్ పరీక్షా ఫలితాలు విడుదల..
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్‌ నిర్వహించిందని చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించినట్లు వెల్లడించారు.

పీజీ ప్రవేశాలకు 39,856 మంది దరఖాస్తు చేసుకోగా.. 35,573 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. అయితే వారిలో 24,164(87.62శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి పాల్గొన్నారు.


Next Story

Most Viewed