ఏపీలో ఈనెల 21 వరకు కర్ఫ్యూ పెంపు

by  |
ఏపీలో ఈనెల 21 వరకు కర్ఫ్యూ పెంపు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 వరకు కర్ఫ్యూ పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది. కర్ఫ్యూ సడలింపులు ఇచ్చినప్పటికీ మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

మాస్క్ ధరించకపోతే రూ.100 ఫైన్ విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఎవరైనా మాస్క్ ధరించకపోతే ఆ ఫోటో తీసి పంపింనా జరిమానా విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈనెల 21 వరకు రాత్రి 10లోపు అన్ని దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వాణిజ్య దుకాణాల్లో మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని మాస్క్ ధరిస్తేనే కొనుగోలు దారుడిని లోపలికి అనుమతించాలని సూచించింది. ఒకవేళ మాస్క్ లేకుండా కస్టమర్లను దుకాణంలోకి పంపినా…దుకాణం నిర్వాహకులు, పనిచేసేవారు మాస్క్‌లు ధరించకపోతే రూ.10వేలు నుంచి రూ.20వేలు వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.



Next Story

Most Viewed