ఏపీ స‌ర్కార్ దూకుడు.. అమెరికాతో పోటీ

by  |
ఏపీ స‌ర్కార్ దూకుడు.. అమెరికాతో పోటీ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా నిర్ధారణ టెస్టుల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. దేశంలోనే మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో మిన్నగా టెస్టులు చేస్తూ ఔర అనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో చేసిన విధంగా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఫలితాలను చేతిలో పెడుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం సాధ్యమైంత త్వరగా టెస్టులు చేసి చికిత్స అందించడానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా కోవిడ్-19 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టింది.

కోవిడ్-19 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను అత్యవసర చికిత్సలకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్ప‌త్రుల‌కు ఎమర్జెన్సీ వైద్యం కోసం వచ్చే రోగులకు, యాక్సిడెంట్స్, ప్రసవాల చికిత్స కోసం వచ్చిన వారికి ఈ టెస్టులు చేయ‌నున్నారు. ఈ కిట్‌లోని స్వాబ్‌తో తొలుత‌ ముక్కులో నుంచి జిగురును టెస్టు కోసం తీస్తారు. దానిని కిట్‌లోని లిక్విడ్‌లో మూడుసార్లు తిప్పి, ఆ స్వాబ్‌కు అతుక్కున్న మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల త‌ర్వాత రిజ‌ల్ట్ తెలుస్తోంది. కిట్‌పై క‌ల‌ర్ మారితే కరోనా సోకిన‌ట్లు నిర్ధారిస్తారు.

ఏపీ ప్రభుత్వం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. మొదటి విడతలో భాగంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాకు 1900 కిట్లను సరఫరా చేశారు. వాటిని కర్నూలు పెద్దాస్పత్రితో పాటు, ఆదోని, నంద్యాల జిల్లాలోని 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు పంపించారు. వీటి ద్వారా టెస్ట్‌లు త్వరగా అవుతుండటంతో సీరియస్‌గా ఉన్న పేషెంట్ల ప్రాణాలను కొంతవరకైనా కాపాడవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed