ఈసీ రమేశ్‌ కుమార్ పరువు నష్టం దావా

by  |
Ramesh
X

అమరావతి: కులం పేరుతో తనపై వ్యక్తిగత విమర్శలు చేసినవారిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్ బుధవారం పరువు నష్టం దావా వేయనున్నారు. అలాగే, మరికొందరు సీనియర్ నేతలు తనపై అనవసరంగా ఆరోపణలు చేశారని పలు వార్తా ఛానళ్లలో వచ్చిన వీడియోల ఆధారంగా మరో కేసు వేయనున్నట్టు సమాచారం. కాగా, స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో సీఎం జగన్ సహా పలువురు వైసీపీ నేతలు రమేశ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా, కుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రతిపక్ష నేతతో కుమ్మక్కయ్యారని ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags: AP, election commission, nimmagadda Ramesh kumar, defamation case

Next Story

Most Viewed