ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. 2 వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,628 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,41,724కి చేరింది. నిన్న ఒక్కరోజులోనే 22 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,154కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,744 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,05,000కి పెరిగింది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక పాజిటివ్ కేసుల విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 291 కేసులు నమోదు కాగా… అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 25 నమోదు అయ్యాయి. కరోనా మరణాల విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 5మంది మృతి చెందగా.. తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇకపోతే ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,36,64,207 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది.


Next Story