ఏపీ నూతన మంత్రుల ప్రమాణస్వీకారం

by  |
ఏపీ నూతన మంత్రుల ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలు బుధవారం భర్తీ కానున్నాయి. మాజీమంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రి పదవులను వారి సామాజికవర్గాలకే చెందిన ఇద్దరు నేతలతో భర్తీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజును ఎంపిక చేశారు. వీరిద్దరు రేపు మధ్యాహ్నం 1.29 గంటలకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వ అధికారులు రాజ్‌భవన్ వర్గాలకు సమాచారం ఇచ్చారు.

మరోవైపు కేబినెట్‌లో కొత్తగా చేరునున్న మంత్రులకు జగన్ ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మోపిదేవి వెంకటరమణ స్థానంలో కేబినెట్‌లోకి రానున్న అప్పలరాజుకు మత్సశాఖ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆయన నిర్వహిస్తున్న ఇతర శాఖలను కూడా అప్పలరాజుకు అప్పగిస్తారా లేక ఏమైనా మార్పులు చేస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా వేణుగోపాల్‌కు పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన కీలక రెవెన్యూశాఖను కేటాయిస్తారా ? లేక శాఖల్లో మార్పులు చేస్తారా అన్న అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. సామాజిక వర్గాల కోణంలో ఆలోచించి మార్పులు లేకుండా చూసుకున్న సీఎం జగన్..శాఖల విషయంలోనూ అదే పంథాను అవలంభిస్తే వేణుగోపాల్‌కు కీలక శాఖలు దక్కనున్నాయి.



Next Story

Most Viewed