ఏ కుట్రలకు తెరలేపుతున్నారో…..

13

దిశ, వెబ్ డెస్క్:
సుప్రీం కోర్టుకు సీఎం జగన్ లేఖ రాసినప్పటి నుంచి చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉండి ఏ కుట్రలకు చంద్రబాబు తెరలేపుతున్నారో అని ఆయన చెప్పారు. అమరావతిలో ఎలాంటి కుట్రలు జరగకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనలో కూడా కరువులు, వరదలు వచ్చాయని ఆయన తెలిపారు. తమ ఎమ్మెల్యేలంతా లోతట్టు ప్రాంతాల్లో ఉండి సహాయక చర్యలను చేపడుతున్నారని ఆయన అన్నారు. పక్క రాష్ట్రంలో ఘటన జరిగితే రాష్ట్రంలో దిశ చట్టం చేసిన ఘనత సీఎం జగన్ దే అని ఆయన అన్నారు.