మేం అప్పుడే వ్యతిరేకించాం

by  |
మేం అప్పుడే వ్యతిరేకించాం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని, సమైక్య రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, కేసీఆర్ నాయకత్వంలో స్వ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పోతిరెడ్డిపాడు అంశంపై అవకాశవాద రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను కొనసాగుతున్నాయని, నల్గొండ జిల్లాలో ఐదారు రిజర్వాయర్ల పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Next Story