సాగు చట్టాలపై అన్నా హజారే యూటర్న్

by  |
సాగు చట్టాలపై అన్నా హజారే యూటర్న్
X

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే గంటల వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్నారు. నిరాహార దీక్ష చేస్తానని హజారే ప్రకటించగానే కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు రాలేగావ్ సిద్ధికి వెళ్లి బుజ్జగించారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి తాను నిరసన దీక్ష చేయడం లేదని అన్నా హజారే ప్రకటించారు. తన డిమాండ్లలో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చిందని వివరించారు. కాబట్టి తాను ప్రతిపాదించిన నిరవధిక నిరాహార దీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed