మాతో చాకిరి చేయికుంటున్నారు.. ఎందుకు పట్టించుకోరు : ఏఎన్‌ఎమ్స్

by  |
మాతో చాకిరి చేయికుంటున్నారు.. ఎందుకు పట్టించుకోరు : ఏఎన్‌ఎమ్స్
X

దిశ, జగిత్యాల : ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఏఎన్‌ఎంలు డ్యూటీలో ఉంటున్నా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉమెన్స్ ఏఎన్ఎం వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు గాండ్ల మధురిమ ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఎన్ఎంల సమావేశం మధురిమ అధ్యక్షతన జరిగింది. ఏఎన్‌ఎంలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా మధురిమ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పరీక్షలు, వైద్యసేవలు, వ్యాక్సిన్స్ వేయడంతో పాటు అన్ని రకాల విధులు నిర్వర్తించినా అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదన్నారు. తాము చేసే పనికి తీసుకునే వేతనానికి అస్సలు సంబంధం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సీనియర్ ఏఎన్ఎంలు స్వరూప, నీరజా, మధురిమలు మాట్లాడుతూ.. ఆదివారం, పండుగలకు తమకు కూడా సెలవులు అమలు చేయాలని కోరారు. ఆరోగ్యం బాలేక పోయినా తమకు సిక్ లీవ్స్ ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని మండిపడ్డారు. కొవిడ్ టీకాను ఉదయం 9 నుంచి 4 గంటల వరకే పరిమితం చేయాలన్నారు. పీహెచ్‌సీ నుంచి వ్యాక్సిన్ కేంద్రాలకు టీకాలను తెచ్చి ఇవ్వాలని మేమే వెళ్లి తెచ్చుకుని, మేమే వెళ్లి ఇచ్చిరావడం ఇబ్బందిగా ఉందన్నారు. 30 ఏళ్లు సర్వీసులు చేసినా తమకు ప్రమోషన్లు లేకుండా ఏఎన్ ఎంలుగా రిటైర్ అవుతున్నామని వాపోయారు. మాకు కూడా పీఆర్సీ అప్లై చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి పద్మ, కోశాధికారి శోభారాణి, ఉపాధ్యక్షురాలు వసంత, నీరజా, సహాయ కార్యదర్శులు మమత, భాగ్య, సుప్రియ, అరుణ, సభ్యురాలు జయప్రద, రజిత, సౌజన్య, ప్రశాంతి, చంద్రకళ, రాణి, జ్యోతి, శంకరమ్మ, ఎలిజబెత్ రాణి, కవితా రాణి, గంగా, వీనీతా, విజయలక్ష్మి, శారద, రజిత, గంగా నర్సు, రాజశ్రీ, కేత లక్ష్మీ, మేరి, సంధ్య, రాజేశ్వరి, వెంకట లక్ష్మీ, దేవయాని, శారద, చిలుకమ్మ, విజయ యమునలతో పాటు వంద మంది ఏఎన్ఎంలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed