సైకిల్ మీద వచ్చి రక్తం తాగుతారు.. ఏపీ ప్రజలను హెచ్చరించిన సీఎం జగన్

by Disha Web Desk 16 |
సైకిల్ మీద వచ్చి రక్తం తాగుతారు.. ఏపీ ప్రజలను హెచ్చరించిన సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే చంద్రముఖి మళ్లీ లకలక అంటుందని.. సైకిల్ మీద వచ్చి రక్తం తాగుతుందని సీఎం జగన్ హెచ్చరించారు. ప్రొద్దుటూరు సభలో పాల్గొన్న సీఎం జగన్.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును చంద్రముఖితో పొల్చుతూ విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తమ పథకాలన్నీ తీసి వేస్తారని వ్యాఖ్యానించారు. పొరపాటును కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దని సూచించారు. చంద్రబాబును నమ్మితే పథకాలను రద్దు చేసుకున్నట్టేనని చెప్పారు. తనపై చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నాయన్నారు. మోసాలు చేసే కూటమి తమకు ప్రత్యర్థిగా ఉందన్నారు. జనాల కోసం తాను 130 సార్లు బటన్ నొక్కానని, వైసీపీ గెలుపు కోసం ప్రజలు 2 బటన్లు నొక్కాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. శవరాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టని విమర్శించారు. నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి చంపారని సీఎం జగన్ ఆరోపించారు.

Read More..

Breaking: వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు


Next Story