Viveka Case: ఆ విషయం ఎలా తెలిసింది?.. వివేకా పీఏకి సీబీఐ ప్రశ్నల వర్షం

by Disha Web Desk 16 |
Viveka Case: ఆ విషయం ఎలా  తెలిసింది?.. వివేకా పీఏకి సీబీఐ ప్రశ్నల వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా సీబీఐ బృందం కడప జిల్లాలో పర్యటించింది. వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారుల బృందం వెళ్లింది. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన పలు అంశాలపై కృష్ణారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. వైఎస్ సునీతారెడ్డికి సమాచారం ఇచ్చింది కృష్ణారెడ్డిగా దర్యాప్తులో తేలడంతో పలు అంశాలపై ఆరా తీశారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం ఎలా తెలుసని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారని ఆరా తీశారు.

కాగా గతంలో కృష్ణారెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆధారాలను చెరిపివేశారని ఆరోపిస్తూ 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను నాటి సిట్ బృందం అరెస్ట్ చేసింది. 90 రోజుల తర్వాత పులివెందుల కోర్టులో ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. దీంతో ఈ ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తాజాగా కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లడం చర్చనీయాంశమైంది.

Next Story

Most Viewed