YS Vivekananda Reddy murder case : హత్య కేసులో కీలక పరిణామం

by Disha Web Desk |
YS Vivekananda Reddy murder case : హత్య కేసులో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఏపీ కేంద్రంగా జరుగుతున్న వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. వివేకా కేసు విచారణను వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని కొరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో, మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే విచారణను బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. విస్తృత స్థాయిలో జరిగిన ఈ కుట్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని... ఆధారాలను మాయం చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో వివేకా హత్య కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారించనుంది.

Next Story

Most Viewed