YS Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

by Disha Web Desk 16 |
YS Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్యకేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. ఇరువాదనలు విన్న హైకోర్టు గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసు మరింత వేగంగా ముందుకు వెళ్లాలంటే నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ మొదటి నుంచి అభిప్రాయపడుతుంది. ఇందులో భాగంగానే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ చుక్కెదురుకావడంతో సుప్రీంకోర్టును, అనంతరం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

బెయిల్ వచ్చిదందుకే..

ఇకపోతే దివంగత వైఎస్ వివేకా హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే కేసు విచారణలో భాగంగా సిట్ 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయలేకపోయింది. దీంతో టెక్నికల్‌గా గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఎర్రగంగిరెడ్డి బయటే ఉన్నారు. అనంతరం ఈ హత్యకేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వచ్చింది. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర అని సీబీఐ గుర్తించింది. ఇందులో భాగంగా పలువురుని విచారించిన సీబీఐ కీలక సాక్ష్యాలతో 2021 అక్టోబర్‌లో మొదటి ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మరింత వేగం పుంజుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని అభిప్రాయపడింది. అనంతరం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే వివేకా హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణ సీబీఐకు బదిలీ అయ్యింది. దీంతో బెయిల్ రద్దు పిటిషన్‌కు కూడా తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

సమాధానమివ్వాలంటూ నోటీసులు

ఏ-1 ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ హత్య కేసు వేగంగా ముందుకు వెళ్లాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణణు ఈనెల 29కి వాయిదా వేసింది. ఇటీవలే వైఎస్ వివేకా హత్యకేసు విచారణపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత ఆలస్యం కావడంపై మండిపడింది. విచారణ అధికారిని ఎందుకు మార్చకూడదని కూడా ప్రశ్నించింది. అంతేకాదు హత్య కేసు విచారణ పురోగతిని సీల్డ్ కవర్‌లో అందచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read...

BV Raghavulu : రెండు జిల్లాల్లో అపార నష్టం.. సీఎం జగన్‌కు లేఖ



Next Story

Most Viewed