ఏపీ హైకోర్టులో వైఎస్ సునీతారెడ్డి పిటిషన్.. ఆ కేసు కొట్టేయాలంటూ అభ్యర్థన

by Disha Web Desk 21 |
YS Sunitha Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పీఏ కృష్ణారెడ్డి తమపై తప్పుడుగా ప్రైవేట్ ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌తోపాటు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ హైకోర్టును కోరారు. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు. ఇదిలా ఉంటే ఇటీవలే వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పలువురిపై పులివెందుల కోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్, సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి బెదిరిస్తున్నారంటూ పులివెందుల కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఎస్పీ రాంసింగ్, వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలంటూ పులివెందుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

కేసును కొట్టేయండి

పులివెందుల కోర్టు ఆదేశాలపై వైఎస్ సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. తాము ఏ తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. తాము పై కోర్టుల్లో పోరాటం చేయకుండా కుట్రలో భాగంగా .. వేధించేందుకు తమపై కేసులు పెట్టారని ఆరోపించారు.ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు ఫిర్యాదును పోలీసులకు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చెల్లుబాటు కాదని చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్‌‌లో పేర్కొన్న అంశాలు తమకు వర్తించబోవని వివరణ ఇచ్చారు. అంతేకాదు పీఏ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణల్లో తాము నేరానికి పాల్పడినట్లు ఎక్కడా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. తమపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. తమపై పగతో, స్థానికుల ప్రమేయంతోనే తప్పుడు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని వైఎస్ సునీతారెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని....కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు.



Next Story

Most Viewed