AP Elections 2024: చిత్తశుద్ధి లేని వాళ్ళే పార్టీ మారుతారు.. వై.యస్ షర్మిల

by Disha Web Desk 3 |
AP Elections 2024: చిత్తశుద్ధి లేని వాళ్ళే పార్టీ మారుతారు.. వై.యస్ షర్మిల
X

దిశ వెబ్ డిస్క్: వై.ఎస్. షర్మిల పరిచయం అవసరం లేని పేరు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరిగానే కాకుండా సొంత పార్టీని నెలకొలిపి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు వై.ఎస్. షర్మిల. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు.. కాగా నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను త్యాగం చేయడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని.. అందుకే తనని పార్టీ లోకి ఆహ్వానించారని.. బహిరంగంగా తెలిపిన ఆమె.. ఈ రోజు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. వివరాలలోకి వెళ్తే.. గతంలో నేతలు పార్టీ మారడం పైన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .. జంపింగ్ జపాంగ్ అంటే తెలుసా.. ఒక పార్టీ నుండి మరో పార్టీకి మకాం మార్చడమే. వాళ్లకు ప్రజలకు మంచి చెయ్యాలి అనే చిత్తశుద్ధి ఉండదు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం పార్టీ మారుతారు. వాళ్ళ పబ్బం గడిచిపోతే చాలు అనుకునే వాళ్ళు పార్టీ మారుతారు అని వెల్లడించారు.

అయితే తొలుత అన్న జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి.. అన్న విజయం కోసం శాయశక్తులా కృషి చేసి చివరికి వ్యక్తిగత విబేధాల కారణంగా అన్నకు దూరమైంది. అన్న కోసం పని చేయడం మానేసి ప్రజలే తన ప్రపంచం అని.. తాను బ్రతుకుతున్నదే ప్రజల కోసం అని.. అణగారిన జీవితాలలో వెలుగు నింపేందుకు .. పేదలకు అండగా నిలిచేందుకు తాను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానంటూ వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే.

ప్రజల కష్టసుఖాలను తన కష్టసుఖాలుగా భావించి.. ప్రజల కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఎన్నికల్లో మాత్రం పోటీ చెయ్యలేదు. అయితే నీతులు చెప్పడానికే కానీ చెయ్యడానికి కాదు అన్నట్టు.. ఆమె సొంత పార్టీ పెట్టి.. పాదయాత్రలు చేపట్టి.. ఉపన్యాసాలు అదరగొట్టి చివరికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు షర్మిల. ఈ నేపథ్యంలో చిత్తశుద్ధి లేని వాళ్ళే పార్టీ మారతారని గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీనితో ట్రోల్లర్స్ రెచ్చిపోతున్నారు. జంపింగ్ జపాంగ్ గురించి తెలుసుకోవాలంటే వైయస్ షర్మిలనే అడగాలి అంటూ ట్రోల్ల్స్ జల్లులు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed