ఔను ఆ ఇద్దరు ఒక్కటయ్యారు: మాజీమంత్రిని ఓడించేందుకు చేతులు కలిపిన టీడీపీ నేతలు

by Disha Web Desk 21 |
ఔను ఆ ఇద్దరు ఒక్కటయ్యారు: మాజీమంత్రిని ఓడించేందుకు చేతులు కలిపిన టీడీపీ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఆ మాజీమంత్రిని టార్గెట్ చేసిందా? వచ్చే ఎన్నికల్లో ఆ మాజీమంత్రిని ఓడించేందుకు టీడీపీ అధిష్టానం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తుందా? ఇప్పటి వరకు ఉన్న ఇన్‌చార్జిని కాదని కొత్త ఇన్‌చార్జిని నియమించడం వెనుక ఆ మాజీమంత్రిని ఓడిచడంలో వ్యూహమా? నిన్న మెున్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు నేడు ఒక్కటవ్వడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే ఆ మాజీమంత్రిని ఓడించేందుకు కలిసి పని చేసేందుకు సిద్ధం అయ్యారా? ఇంతకీ ఆ మాజీమంత్రి ఎవరు? ఒక్కటైన ఆ ఇద్దరు నేతలు ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇన్‌చార్జిగా వెనిగండ్ల రాము

మాజీమంత్రి కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ ఆరంగేట్రం చేసిన కొడాలి నాని అనంతరం వైసీపీలో చేరి మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఆయన తనయుడు నారా లోకేశ్, ఇతర టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం విమర్శించలేని దారుణంగా చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడంలో కొడాలి నాని దిట్ట. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట చంద్రబాబును దారుణంగా విమర్శలు చేస్తుంటారు. దీంతో కొడాలి నానిని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే గుడివాడ నియోజకవర్గంలో ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో వెనిగండ్ల రాముకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. దీంతో అధిష్టానం గుడివాడ ఇన్‌చార్జిగా వెనిగండ్ల రామును నియమించింది.

రావికి ఎమ్మెల్సీ ఆఫర్

రావి వెంకటేశ్వరరావు కష్టకాలంలో అంటే 2019 ఎన్నికల అనంతరం పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయడమే తన లక్ష్యంగా పోరాటం చేశారు. టీడీపీ అధిష్టానం ఇచ్చిన ప్రతీ పిలుపును అమలు చేశారు. ప్రతీ నిరసనలో పాల్గొన్నారు. గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరగడం వేయడం తన లక్ష్యమంటూ అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లారు. ఇంతలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము నియోజకవర్గానికి చేరుకున్నారు. టీడీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదే అంటే తనదే అని బహిరంగంగా చెప్పుకునే వారు. కానీ సర్వేలలో వెనిగండ్ల రాముకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో టీడీపీ అధిష్టానం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. రాముతో కలిసి పనిచేయాలని రావి వెంకటేశ్వరరావుకు స్పష్టం చేసింది. రావి వెంకటేశ్వరరావు కష్టకాలంలో పార్టీకి ఎంత చేశారో అంతా గుర్తించినట్లు తెలిపారు. రావి వెంకటేశ్వరరావు టీడీపీని బలోపేతం చేయడంలో ఎంతో శ్రమించారని స్పష్టం చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థిని బలంగా ఢీ కొట్లాలని ఈ పరిణామాలని....గుడివాడలో ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ గెలవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా గుడివాడ ఇన్‌చార్జిగా వెనిగండ్ల రామును నియమిస్తున్నట్లు తెలిపింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి లిస్టులోనే రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని భరోసా ఇచ్చారు. దీంతో రావి వెంకటేశ్వరరావు వెనిగండ్ల రాముతో కలిసి పనిచేయడానికి సరే అని అన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed