Ycp: తెలుగుదేశం పార్టీ గెలుపుపై సజ్జల మళ్లీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Ycp: తెలుగుదేశం పార్టీ గెలుపుపై సజ్జల మళ్లీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా విజయంసాధించింది. దీంతో ఓటమిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలపై ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే పశ్చిమ రాయలసీమ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అటు వైసీపీ నేతలు కూడా ఎన్నికల్లో గందరగోళం జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం వచ్చే సాధారణ ఎన్నికల్లో పొత్తుల్లేకుండా రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.

టీడీపీ అక్రమాలకు పాల్పడింది..

ఇదిలా ఉంటే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ‘పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ అక్రమాలకు పాల్పడింది. వైసీపీ ఓట్లను టీడీపీలో కలిపేశారు. ఒక్క బండిల్‌లోనే 6 ఓట్లు తేడాగా కనిపించాయి. అన్ని బండిల్స్ తీస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. టీడీపీ వైరస్ లాంటిది. చంద్రబాబు రిజెక్టెడ్ పొలిటీషియన్. అర్జెంటుగా అధికారం చేపట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది ఇప్పుడు వ్యవస్థలు నాశనమయ్యాయని చంద్రబాబు అంటున్నారు అవసాన దశలో చంద్రబాబు ఉన్నారు. వైసీపీ ఎప్పుడూ ధర్మ యుద్ధమే చేస్తుంది.’ అని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed