సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్.. సజ్జల స్ట్రాంగ్ రియాక్షన్

by Disha Web Desk 16 |
సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్..  సజ్జల స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధిపై దమ్ముంటే సీఎం జగన్ చర్చకు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే ఈ సవాల్‌పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పుకునేలా ఆయన చేసిన పథకమేదైనా ఉందా అని నిలదీశారు. ఈసారి సైతం అధికారంలోకి రాలేమని తెలిసే చంద్రబాబు సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాలేరు కాబట్టే ఎన్ని సవాళ్లైనా విసురుతారని విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. ఈ ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడుగుతారని సజ్జల ప్రశ్నించారు.

అధికారం తమదేనని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని సజ్జల విమర్శించారు. తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతోనే ఓట్లు అడుగుతున్నామని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు సభలు ఎందుకు పెడుతున్నారో ఎవరికీ తెలియదన్నారు. రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు చేరింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని., అది ప్రతి ఒక్కరికీ తెలుసుని విమర్శించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని సజ్జల ఎద్దేవా చేశారు.

Read More..

Breaking News : చంద్రబాబుకు రోజా సలహా.. అదేంటంటే..?



Next Story

Most Viewed