Malaysia: అంతర్జాతీయ పోటీల్లో భీమవరం విద్యార్థినికి మూడో స్థానం

by Disha Web Desk 16 |
Malaysia: అంతర్జాతీయ పోటీల్లో భీమవరం విద్యార్థినికి మూడో స్థానం
X

దిశ, భీమవరం: మలేషియా దేశ రాజధాని జొహర్ బాహర్‌లో జరుగుతున్న 'ఏషియా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2023' అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 84 కేజీల సబ్-జూనియర్ విభాగంలో భీమవరం విద్యార్థిని కుమారి పిల్లి వందన మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ 3వ స్థానంతో పాటు ఆమె స్క్వాట్‌లో సిల్వర్ మెడల్, బెంచ్ ప్రెస్‌లో బ్రాంజ్ మెడల్, డెడ్ లి‌లో బ్రాంజ్ మెడల్, ఓవర్ ఆల్ చాంపియన్షిప్‌లో బ్రాంజ్ మెడల్, మొత్తం 4 మెడల్స్‌ గెలుపొందారు. ఈ 18వ తేదీ వరకూ పోటీలు కొనసాగనున్నాయి.

భీమవరానికి చెందిన వెంకటలక్ష్మి, సాయిబాబాల రెండవ పుత్రిక వందన కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఒక వైపు ఇంజినీరింగ్ విద్యలో రాణిస్తూనే, మరో వైపు క్రీడల పట్ల ఆసక్తిని కనబరచారు. దీంతో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభను చూపుతున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో దేశం, తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచిన విద్యార్థినికి ఆమె చదువుతున్న కళాశాల యాజమాన్యం, సిబ్బంది, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.



Next Story

Most Viewed