పథకాల మాటున ఒక్కో కుటుంబం నుంచి లక్ష వసూళ్లు!

by srinivas |   ( Updated:2022-11-23 14:32:56.0  )
పథకాల మాటున ఒక్కో కుటుంబం నుంచి లక్ష వసూళ్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ (Ycp) ప్రభుత్వ మూడున్నరేళ్లపాలనలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకట రమణ అన్నారు. వైఎస్ జగన్ పాలనలో అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు, పన్నుల పెంపు విపరీతంగా పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం మీడియాతో మాట్లాడారాయన. పెంచిన ధరలతో వైసీపీ ప్రభుత్వం ఒక్కో కుటుంబం నుంచి ఏడాదికి సుమారు రూ.లక్ష రూపాయల వరకు దోచుకుంటుందని ఆరోపించారు. సంక్షేమ పథకాల మాటున దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ప్రజలకు వైసీపీ చేసిందేమి లేదని బోళ్ల వెంకట రమణ విమర్శించారు.



Next Story

Most Viewed