డాబాపై పడుకున్న 14ఏళ్ల బాలిక.. తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా డాక్టర్ వెళ్లి..

by Disha Web |
డాబాపై పడుకున్న 14ఏళ్ల  బాలిక.. తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా డాక్టర్ వెళ్లి..
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారం, దాడుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్, రేపల్లెలో గ్యాంగ్ రేప్ ఘటనలు మరువకముందే విజయనగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కోనసీమ జిల్లాలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలానికి చెందిన వేగి రమేశ్ ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. అయితే ఆరు నెలల క్రితం ఏడో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినికి వైద్యం చేశాడు. ఆ సమయంలో ఆ బాలిక వద్ద నుంచి ఆమె ఫోన్ నంబర్ తీసుకుని పరిచయం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా బాలిక డాబాపై పడుకున్న సమయంలో వైద్యుడు డాబాపైకి వెళ్లాడు. నిద్రపోతున్న బాలికపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ విషయాన్ని బాలిక తమకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed