Ayyanna ఇంటి గోడ కూల్చివేతపై ప్రైవేటు కేసు

by Disha Web Desk 16 |
Ayyanna ఇంటి గోడ కూల్చివేతపై ప్రైవేటు కేసు
X

అదనపు సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వేసిన రాజేష్

మొత్తం 14 మంది అధికారులపై పిర్యాదు

ఇటువంటి ఘటనలు పునరావృతం కావొద్దంటున్న మాజీ మంత్రి

దిశ, అల్లూరి జిల్లా: గత ఏడాది జూన్ 6న నర్సీపట్నంలో రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయులు విజయ్, రాజేష్ ఇంటి గోడ కూల్చి వేసిన ఘటన తెలిసిందే. నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించారనే కారణంతో ఈ కూల్చివేతకు పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీనిపై సోమవారం నర్సీపట్నంలో అదనపు సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అయ్యన్న తనయుడు రాజేష్ ప్త్రైవేటు కేసు వేశారు. ఆర్డీవో గోవిందరావు, ఏఎస్పీ మణికంఠ చందోలు, తహశీల్ధారు జయతో పాటు మొత్తం 14 మందిపై కేసు వేశారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. దీనికి అడ్డుకట్ట వేసి, భవిషత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఏ2 విజయసాయిరెడ్డి ఆదేశాలతో అధికారులు ఈ చర్యలకు పాల్పడినట్టు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు జరిగినా భయపడకుండా ప్రైవేటు కేసులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యాయవాది ఈశ్వరావు మాట్లాడుతూ ఈ ఘటన అన్యాయాలకు మచ్చుతునకగా పేర్కొనవచ్చన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అధికారులకు తలొగ్గకుండా వ్యవహరించాలన్నారు. అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో నోటీసు అంటించామని అధికారులు చెప్పారన్నారు. అయితే దానికి భిన్నంగా గోడను పగులకొట్టే గంట ముందు నోటీసు అతికించారన్నారు. పలు శాఖలకు చెందిన అధికారులు ముందస్తు నోటీసుల్లేకుండా ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. అధికారులు కుట్రలో భాగం కాకూడదని ఆయన సూచించారు. నీటిపారుదల శాఖ అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమేనని తెలియజేసేందుకే ఈ కేసు వేశామన్నారు. సెలవు రోజుల్లోనూ, రాత్రి వేళల్లో ఇటువంటి కూల్చివేతలకు పాల్పడకూడదని చట్టం చెబుతున్నా, అధికారులు దానికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. భవిషత్తులో దీనిని ఆనవాయితీగా తీసుకుని, మరిన్ని చర్యలకు పాల్పడతారనే కారణంతో ఈ కేసు వేశామని న్యాయవాది ఈశ్వరావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : AP CIDపై Nara Lokesh సెటైర్లు.. కారణం జగనేనని మండిపాటు

Next Story

Most Viewed