సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన విలేకరి?

by Disha Web Desk 18 |
సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన విలేకరి?
X

దిశ ప్రతినిధి, విజయవాడ: సమాజంలో ఎంతో ఉన్నతమైన వృత్తిలో ఉండి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడో జర్నలిస్ట్. వరుసగా కూతురు అయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని జర్నలిజానికే మచ్చ తెచ్చాడు.ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గన్నవరం పోలీసులు అందించారు. గన్నవరం నియోజకవర్గంలో ఓ మీడియా సంస్థ లో విలేఖరిగా పనిచేస్తున్న వ్యక్తి వరుసకు కూతురు అయ్యే యువతికి మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి, బంధువులు తమ కూతురికి న్యాయం చేయాలని మీడియా ప్రతినిధులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు కామాంధుడు ఈ విషయం ఇంతటితో ఆపేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆ కుటుంబం సోమవారం రాత్రి గన్నవరం పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed