TDP: విశాఖపై స్పెషల్ ఫోకస్.. రంగంలోకి బాలకృష్ణ అల్లుడు

by srinivas |
TDP: విశాఖపై స్పెషల్ ఫోకస్.. రంగంలోకి బాలకృష్ణ అల్లుడు
X

దిశ, ఉత్తరాంధ్ర: వైసీపీ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎం.భరత్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు. విశాఖలో జీవన పరిస్ధితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. డ్రైనేజీ గోడలు కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు లేవన్నారు. కాలుష్యం ఒక ప్రధాన సమస్యగా ఉందని, దోమల బెడద కూడా విపరీతంగా ఉందని తెలిపారు. పేదలకు మేలు చేయాలనుకుంటే టిడ్కో ఇళ్లు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇచ్చిన పథకాలతో సంతోషంగా ఉన్నామని ఏ ఒక్కరూ చెప్పడంలేదన్నారు. ప్రతి వార్డులో పథకాలు ఆగిపోయాయన్న అంశాలే తమ దృష్టికి వచ్చాయన్నారు. హైదరాబాద్‌తో పోటీ పడాల్సిన నగరం నానాటికీ దిగజారిపోతోందని భరత్ ఆందోళన వ్యక్తం చేశారు.


మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి మాట్లాడుతూ ఆరు వారాల పాటు మీ కోసం మీ భరత్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రజల కష్టాలు సమస్యలు స్వయంగా తెలుసుకున్నామని చెప్పారు. పోర్టు ప్రదేశంలో బల్క్ కార్గో బహిరంగంగా విడిచి పెడుతున్నారని అన్నారు. దీని వల్ల కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, దానికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. పాతనగరంలో డ్రైనేజీ సమస్య ఉందని, తాగునీటి పైప్ లైన్లు దెబ్బతినడంతో చాలా ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ఉందన్నారు. 33 వార్డు వెంకటేశ్వర మెట్టలో భూములపై దేవాదాయ శాఖ విభాగం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. జగదాంబ , పూర్ణ మార్కెట్ కూడళ్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావాలని స్థానికులు చెప్పినట్లు తెలిపారు. పాతనగరం వాసులకు సబ్బవరం, పైడివాడ, అగ్రహారం గ్రామాల్లో గృహాలు ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Kadapa: బద్వేలు తెలుగు తమ్ములకు నారా లోకేష్ క్లాస్?



Next Story