Ap News:బీసీలకు అన్యాయం..ఆ పార్టీలపై ఫైర్ ఐన రామచంద్ర యాదవ్

by Disha Web Desk 18 |
Ap News:బీసీలకు అన్యాయం..ఆ పార్టీలపై ఫైర్ ఐన రామచంద్ర యాదవ్
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:వెనుకబడిన ఉత్తరాంధ్రాతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు టికెట్ కేటాయింపులో బీసీ లకు అన్యాయం చేశారని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రాలో ప్రధాన బీసీ కులాలైన తూర్పు కాపులు, యాదవులు, గవరలకు ఆ రెండు పార్టీలు అన్యాయం చేశాయని ఒక ప్రకటనలో అవేదన వ్యక్తం చేశారు. బీసీ కేటగిరి లో వచ్చే తూర్పు కాపు లకు ఇవ్వాల్సిన టికెట్ లను ఓసి కాపులకు ఇచ్చి మోసం చేశాయని పేర్కొన్నారు. అలాగే బీసీ లైన గవర సామాజిక వర్గం అంటే గుర్తుకు వచ్చే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు ప్రధాన పార్టీలు ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేశాయని పేర్కొన్నారు.

యాదవ సామాజిక వర్గం విశాఖ నగరంలో ప్రధాన కులమైనప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ప్రతిరోజూ బీసీల భజన చేసే ఆ పార్టీలు నిజస్వరూపం టికెట్ కేటాయింపులో బయటపడిందని పేర్కొన్నారు. SC,ST లకు తాము చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొనే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో రిజర్వేషన్ సీట్లు మాత్రమే కేటాయించారు. అన్ రిజర్వుడ్ లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని తప్పుపట్టారు. ప్రధాన పార్టీలు ఈ వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించాలని కోరారు.BC,SC,STల రాజకీయాధికారమే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ పనిచేస్తుందని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.


Next Story