Visakha: స్టీల్ ప్లాంట్ కోసం కొత్త ఉద్యమం.. కేంద్రం దిగిరావాల్సిందేనా..?

by Disha Web Desk 16 |
Visakha: స్టీల్ ప్లాంట్ కోసం కొత్త ఉద్యమం..  కేంద్రం దిగిరావాల్సిందేనా..?
X

దిశ, ఉత్తరాంధ్ర: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజల మద్దతు కూడగడుతోంది. ఏపీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ దండి ప్రియాంక ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అవసరాన్ని వివరిస్తున్నారు "ఐ స్టేండ్ విత్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ " # నో ప్రైవేటైజేషన్# నినాదంతో ఎంవీపీ కాలనీ రైతు బజార్‌లో వాహనాలకు స్టికర్లను అంటిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రజా తిరుగుబాటుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు జగన్ మురారి, నొల్లు నాగరాజు, దల్లి కనకరాజు, విశాఖఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు దేముడు దరిమి రెడ్డి, సునీల్ కుమార్, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed