Rajyasabha: ఎటువంటి ప్రాతిపాదన లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం

by Disha Web Desk 16 |
Rajyasabha: ఎటువంటి ప్రాతిపాదన లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌పూరి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సవరించిన మెట్రో రైలు విధానం, 2017 ప్రకారం మెట్రో రైలు ప్రతిపాదనను మళ్లీ సమర్పించాలని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదనను రాలేదని హర్దీప్ పూరి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద లైట్ రైల్ ప్రాజెక్ట్‌ను నిర్మించాలనుకుంటున్నట్లు తెలియజేసిందని తెలిపారు. కొరియా (కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్) నుంచి ఆర్థిక సహాయం కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని కేంద్రమంత్రి తెలిపారు. భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్‌కు అందించగా ప్రాజెక్ట్‌కు నిధులు అందించలేమని తెలియచేసిందని తెలిపారు. ఏప్రిల్, 2019లో విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ ప్రతిపాదన విషయమై గో ఏపీకి కేంద్రం రుణ సహాయం కోసం ఇతర ద్వైపాక్షిక బహుపాక్షిక ఏజెన్సీలకు సంప్రదించవచ్చని సలహా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ఇతర ద్వైపాక్షిక బహుపాక్షిక ఏజెన్సీ నుంచి ఆర్థిక సహాయం ప్రతిపాదన గో ఏపీకి సమర్పించలేదని మంత్రి తెలిపారు.

ప్రధాని మోదీ రైల్వే రంగంలో వందే భారత్ రైలు వంటి విప్లవాత్మకమైన అభివృద్ధి చూపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైలు వంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి చేతకానితనానికి నిదర్శనమని, ఇది విశాఖ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని అని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed