గీతాంజలి ఆత్మహత్య.. ప్రారంభమైన అరెస్టుల పర్వం

by Disha Web Desk 12 |
గీతాంజలి ఆత్మహత్య.. ప్రారంభమైన అరెస్టుల పర్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ ప్రభుత్వ పథకాలను పొందినందుకు ఆనందంతో మీడియాతో మాట్లాడిన తెనాలికి చెందిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ.. ట్రోల్స్‌కు గురైంది. దీంతో సోషల్ మీడియలో పలువురు ఆమెను వైసీపీ ప్రమోషన్ కోసం వాడుకుందని, ఆమెపై బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టారు. దీంతో గీతాంజలి రైలు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దాదాపు మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు గీతాంజలి జట్టు తిరుగుతున్నాయి.

గీతాంజలి మృతి టీడీపీ నేతల ట్రోల్స్ కారణమని వైసీపీ బలంగా ఆరోపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి.. ఆమెను ఇబ్బందులకు గురి చేసే విధంగా కామెంట్లు, పోస్టులు పెట్టిన వారిని గుర్తించినట్లు.. ఎస్పీ తుషార్ వెల్లడించారు. గీతాంజలి సూసైడ్ కు కారణమైన వారిలో ఇద్దరిని ఆరెస్ట్ చేశామని.. మరో 30 మందిని గుర్తించామని.. త్వరలో వారిని పట్టుకుంటామని.. గీతాంజలి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మరోసారి స్పష్టం చేశారు.

Read More..

ఉద్యోగ వేటలో ఉన్న ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

పెనమలూరు నుంచే పోటీ చేస్తా: మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్



Next Story