ఉద్యోగ వేటలో ఉన్న ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

by Sridhar Babu |
ఉద్యోగ వేటలో ఉన్న ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, చైతన్య పురి : ఉన్నత చదువులు చదివి ఉద్యోగ వేటలో ఉన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, ఆలు పాక గ్రామానికి చెందిన సుంకర వెంకట సుబ్బారావు కుమార్తె సుంకర సాహితి (26) ఎంబీఏ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుద్దామని రెండు నెలల క్రితం హైదరాబాద్​ చేరింది.

దిల్ సుఖ్ నగర్ లోని లక్ష్మి ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. ఉద్యోగం వెతుక్కునే క్రమంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి వెంకట సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story