Tirumala Brahmotsavam : శ్రీ‌హ‌రికి రెండు బ్రహ్మోత్సవాలు

by Disha Web Desk 9 |
Tirumala Brahmotsavam : శ్రీ‌హ‌రికి రెండు బ్రహ్మోత్సవాలు
X

దిశ, తిరుమల: ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా సెప్టెంబ‌రు 18న ధ్వ‌జారోహ‌ణం, సెప్టెంబ‌రు 22న గ‌రుడ వాహ‌నం, 23న స్వ‌ర్ణ‌ర‌థం, 25న ర‌థోత్స‌వం(మ‌హార‌థం), 26న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం ఉంటాయి. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో అక్టోబ‌రు 19న గ‌రుడ‌ వాహ‌నం, 22న స్వ‌ర్ణ‌ర‌థం, 23న చ‌క్ర‌స్నానం జ‌రగ‌నున్నాయి. బ్రహ్మోత్సవాల కాలంలో అష్ట‌ద‌ళ‌పాద‌ ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌ సేవ‌, స‌హ‌స్ర‌ దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ముంద‌స్తుగా ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌ను నిర్దేశిత వాహ‌న‌ సేవ‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల అంకురార్ప‌ణ కార‌ణంగా అక్టోబ‌రు 14న స‌హ‌స్ర‌ దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Next Story