తిరుపతి అభివృద్ధికి కృషి.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడి, మేయర్ డా.శరీష

by Disha Web Desk 14 |
తిరుపతి అభివృద్ధికి కృషి.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడి,  మేయర్ డా.శరీష
X

దిశ, తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ప్రధానంగా తిరుపతి అభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం, ప్రజలకు అవసరమైన రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యాలను కల్పించే పనులకు ఆమోదం తెలుపుతూ కౌన్సిల్ ఆమోదించినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సాదారణ సమావేశం మంగళవారం ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హల్లో మేయర్ డాక్టర్ శిరిష అధ్యక్షతన, కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి హాజరుకాగా కమిషనర్ హరిత తీర్మానాలను ప్రవేశపెట్టగా, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, నరసింహాచారి, గణేష్, ఉమా, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ చాలా చక్కగా అభివృద్ది పనులను చేపడుతున్నదని, ఏ మునిసిపాల్టీలో కూడా చేపట్టనన్ని నూతన రహదారులను తిరుపతి నగరంలో తీసుకురావడంతో ఓక్కసారిగా నగరం అభ్భివృద్దికి వైపుకు పయనించడం జరుగుతున్నదన్నారు. రోడ్లు వేయడం ఓకవైపు అయితే, ఆ రోడ్లకు తిరుమల స్వామి వారిని కీర్తించిన, సేవలు చేసిన మహనీయుల పేర్లను ఆ రోడ్లకు పెట్టడం అభినందనీయమన్నారు.

తిరుపతి ప్రజల అభివృద్ధికి నిరంతరం తాను కృషి చేస్తానని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి నగరంలోని డివిజన్లలో ప్రజలకు అవసరమైన పనులను చేపట్టుటకు కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదించడం జరిగిందన్నారు. తిరుపతిలోని ప్రతి డివిజన్లలోని అన్ని సమస్యల పరిష్కారాని తగు చర్యలు తీసుకుంటామని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక ఆహ్వానితులు, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డికి టిటిడి చైర్మెన్ గా మరోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, భూమనకు మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు అభినందనలు తెలియజేసారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్దికై మేము వచ్చే తరం గురించి ఆలోచిస్తూ పయనిస్తున్నామని స్పష్టం చేసారు. తమ కౌన్సిల్లోని సభ్యుల సహకారంతో తిరుపతి అభివృద్దికి పనులను చేపడుతున్నామని, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన అనేక ప్రయోజనాలు చేకురుతున్నాయని, మరింత అభివృద్దికై మరిన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరుగుతుందన్నారు. ఎస్వీ యూనివర్శిటీలో మూడు రోడ్లను తీసుకురావాలని అనుకున్నాము గాని, మధ్యలోని రోడ్డుకు అనేక ఆక్షేపణలు రావడం, కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి అనే కోణంలో ఆలోచించి, కౌన్సిల్లో చర్చించి ఆ రోడ్డును తీసుకురావలనే నిర్ణయాన్ని నిలిపివేస్తున్నామని, దాదాపు అందరితో చర్చించిన పిదప ఎస్వీ యూనివర్శిటి నుండి ఎన్.సి.సి. నగర్ మీదుగా జూ పార్క్ ను కలుపుతూ ఓక రోడ్డును, అదేవిధంగా ఎస్వీ యూనివర్శిటి గ్యాస్ గౌడన్ ప్రక్కగా, ఆర్ట్స్ కళాశాలను ఆనుకొని వెలుతూ జూ పార్క్ ను కలిపేలా మరొక రోడ్డును తీసుకురావలని కౌన్సిల్ ఆమోదించడం‌ జరిగిందన్నారు.

డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ.. తిరుపతి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బాటలోనే తామంతా వెలుతూ, తిరుపతి అభివృద్ది వైపుకు పయనిస్తామని ముద్ర నారాయణ స్పష్టం చేసారు. కౌన్సిల్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలను మేయర్, కమిషనర్లు తెలియజేసారు. ఎస్వీ యూనివర్సిటీలో ఇప్పటికే ప్రతిపాదిత మూడు మాస్టర్ ప్లాన్ రోడ్లను కాకుండా మొదటి గేటు ప్రక్కన వున్న గ్యాస్ గౌడన్ ప్రక్కనుండి, ఆర్ట్స్ కాలేజ్ కౌంపౌండ్ ప్రక్కగా ఒకటి, అదేవిధంగా ఎన్.సి.సి నగర్ వైపుగా జూ పార్క్ రోడ్లను కలుపుతూ రెండు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగింది. తిరుపతి మంచినీళ్ళ గుంట అభివృద్దికి టిటిడి 75 లక్షలు కేటాయిస్తూ, నిర్వహణ కొరకు టిటిడికి మంచీనీళ్ళగుంటను అప్పగించాలని కోరడంతో, కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగింది. నూతన కరకంబాడి రోడ్డు నుండి తిమ్మినాయుడు పాళెం వరకు అదేవిధంగా తిమ్మినాయుడు ఫాళెం రోడ్డు నుండి బృందవనం అపార్ట్మెంట్ వరకు రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ కొరకు 3 కోట్ల 85 లక్షలను కేటాయిస్తూ ఆమోదం. నూతనంగ గెస్ట్ లైన్ రోడ్డు నుండి మంగళం గుడి వరకు నిర్మించే రోడ్డుకు 1 కోటి 50 లక్షలు కేటాయింపు. శ్రీనివాసం వెనుక వైపు 40 అడుగుల బిటి రోడ్డు, లైటింగ్ కోసం 1 కోటి 45 లక్షలు కేటాయిస్తూ ఆమోదం.

19వ డివిజన్లో డ్రైనేజి, రోడ్లు వేయుటకు 1 కోటి 65 లక్షలకు ఆమోదం. ఇ.ఎస్.ఐ. దగ్గరున్న షాదీ మహాల్ అభివృద్ది కొరకు 80 లక్షలు కేటాయింపు. 20వ డివిజన్లో పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టెందుకు 1 కోటి 96 లక్షలకు ఆమోదం. 22వ డివిజన్లో పాడైన రోడ్ల స్థానంలో సిసి రోడ్లు, బిటి రోడ్లు వేసేందుకు 1 కోటి 30 లక్షలకు ఆమోదం. శ్రీదేవి కాంప్లెక్స్ వెనుక రోడ్డు విస్తరణకు 1 కోటి 16 లక్షలకు ఆమోదం, టిటిడి ఏడి బిల్డింగ్ ప్రక్కన భవాని నగర్లో వెలుతున్న రోడ్డును విస్తరించేందుకు 1 కోటి 97 లక్షలు మంజూరు, 2 కోట్ల 14 లక్షలు వెచ్చించి ప్రజల కోసం డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేయుటకు, 21వ డివిజన్లో పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టెందుకు 1 కోటి 50 లక్షలకు కౌన్సిల్ ఆమోదం లభించినట్లు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత తెలిపారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed