డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. 1, 2న హాల్ టికెట్ల డౌన్‌లోడ్

by Vemula.Srinu Prasad |

డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది...

డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. 1, 2న హాల్ టికెట్ల డౌన్‌లోడ్
X

దిశ, వెబ్ డెస్క్: డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. జులై 1,2 తేదీల్లో apdsc.apcfc.in సైట్‌లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 20, 21న మెగా డీఎస్సీ-2025 నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే విశాఖలో ప్రధాని మోడీ యోగా డే ఉండటంతో వాయిదా వేశారు. ఈ మేరకు కొత్త హాల్ టికెట్లను రెడీ చేశారు. ఎక్జామ్ సెంటర్స్‌తో పాటు పరీక్ష తేదీలతో ఈ కొత్త హాల్ టికెట్లు ఉండనున్నాయి. ఈ హాల్ టికెట్లను జులై 1, 2వ తేదీల్లో అధికారిక వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Next Story