పిల్లలకు పంచె చిక్కిలోనూ కక్కుర్తి.. అర్హతలేని కంపెనీలకు టెండర్లు: పట్టాభి

by Web Desk |
పిల్లలకు పంచె చిక్కిలోనూ కక్కుర్తి.. అర్హతలేని కంపెనీలకు టెండర్లు: పట్టాభి
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్థుడు సీఎం అయితే.. ఏ విధంగా దోచుకుంటారో జగన్‌ ప్రత్యక్ష ఉదాహరణ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ రెడ్డి మూడేళ్ల పాలనలో ఇసుక, మద్యం, మైనింగ్‌.. ఇలా దేనినీ వదలి పెట్టలేదనీ, అన్నింటా స్కాములు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆదివారం మాట్లాడుతూ, వారానికి మూడు సార్లు పిల్లలకు పంచె చిక్కి లో కక్కుర్తి పడ్డారని ధ్వజమెత్తారు.

గతేడాది రూ. 136 కోట్లు ఉన్న చిక్కీ సరఫరా టెండర్‌, ఈ ఏడాది రూ. 198 కోట్లకు పెంచారన్నారు. అర్హతలేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు. ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్న, పప్పుచెక్కల్లో కూడా కోట్లు తినేస్తున్నారని ఆరోపించారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే పీఎం పోషణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకం లాగా జగనన్న గోరుముద్ద గా మార్చారని పట్టాభి అన్నారు.



Next Story

Most Viewed