Ayyannapatruduకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

by Disha Web Desk 16 |
Ayyannapatruduకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ చేసి ఎన్‌వోసీ తీసుకున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తు కొనసాగించవచ్చునని ధర్మాసనం స్పష్టం చేసింది. నర్సీపట్నంలో తన ఇల్లు నిర్మించే క్రమంలో ఎన్‌వోసీ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను అయ్యన్న ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

విచారణ కొనసాగించాలి...

అయితే అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించగా.. కేసుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సిటి రవికుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. సెక్షన్‌ 41సీఆర్పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ ఆదేశాలిచ్చింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగానే విచారణ చేయాలని హైకోర్టుకు ధర్మాసనం సూచించింది.

Next Story

Most Viewed