సీఎం జగన్, మంత్రి సురేశ్‌‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
సీఎం జగన్, మంత్రి సురేశ్‌‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎటు చూసినా స్కాంలే కనిపిస్తాయని చంద్రబాబు అన్నారు. ‘రా... కదలిరా’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆయన కనిగిరిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు కురిపించారు. ప్రజలకు రూ.10 ఇస్తూ రూ. 100 లాక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇదేందని ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే వెంటనే కేసులు పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్థానచలనాలు ఉంటాయని ఎవరైనా ఊహించి ఉంటారా అని ప్రశ్నించారు. యర్రగొండపాలెం చెత్త కొండపిలో బంగారం అవుతుందా అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను ఉద్దేశించి విమర్శించారు. సీఎం జగన్ చేసిన తప్పులకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బలి అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే కావాలంటే తనను బాగా తిట్టాలని.. అప్పుడే జగన్‌కు సంతోషం కలుగుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

లోకేశ్‌ను, పవన్ కల్యాణ్‌ను తిట్టే వారికే వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని అని చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసరాల ధరలను తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజల కోసమే రా.. కదలిరా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు. అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పిలుపు నిచ్చారు. పాదయాత్ర చేసినప్పుడు జగన్ అందరికీ ముద్దులు పెట్టారని, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు. తాము ఐటీని తీసుకొస్తే జగన్ రూ. 5 వేల ఉద్యగం ఇచ్చారని వాలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమర్థవంతంగా పాలించగలిగినప్పుడే కరెంట్ చార్జీలు సైతం అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన పన్నుల భారమే కనిపిస్తోందని, ప్రభుత్వ అప్పులనూ ప్రజలే తీర్చాల్సి వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed