కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: హనుమంత వాహనంపై శ్రీనివాసుడు

by Disha Web Desk 21 |
కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: హనుమంత వాహనంపై శ్రీనివాసుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆరో రోజు అయిన శుక్రవారం ఉదయం హనుమంత వాహన సేవ నిర్వహించారు. మలయప్పస్వామి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారి వాహన సేవను తిలకించారు. ఇకపోతే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనసేవ, సాయంత్రం నాలుగు గంటలకు అత్యంత విశేషమైన పుష్పక విమాన సేవ జరగనుంది. మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు అని టీటీడీ తెలిపింది.

హ‌నుమంత వాహనసేవలో సాంస్కృతిక వైభ‌వం

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో శుక్ర‌వారం ఉద‌యం హ‌నుమంత వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 12 కళాబృందాల్లో 305 మంది కళాకారులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు. మహారాష్ట్ర థానే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ బృందం ప్ర‌ద‌ర్శించిన గోందల్ అనే నాట్య విన్యాసం భక్తులను సంభ్ర‌మాశ్చర్యంలో ముంచెత్తింది. 20 ఏళ్లలోపు యువతీ యువకులు మెరుపు వేగంతో అనేక గతులలో నృత్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన‌ శ్రీరామ పట్టాభిషేకం కనువిందు చేసింది.

Next Story

Most Viewed