'బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన ద్రోహి జగన్ '

by Disha Web Desk 16 |
బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన ద్రోహి జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన వంద సంక్షేమ పథకాలను రద్దు చేసి, రూ.34 వేల కోట్ల బీసీ నిధులను దారిమళ్లించిన సీఎం వైఎస్ జగన్ బీసీ ద్రోహి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీలను మరోసారి మోసం చేసేందుకు జగన్ రెడ్డి ఈ రోజు వైసీపీ బీసీ మంత్రులు, నేతల సమావేశం జరిపించి వారితో అబద్దపు ప్రకటనలు చేయించారన్నారు. అన్ని వర్గాలకూ అమలు చేసిన పథకాలే బీసీలకు అందింస్తూ.. వాటినే ప్రత్యేక పథకాలుగా ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మూడున్నరేళ్లలో రూ.34వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి బీసీ సాధికారితను మంట గలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆదరణ పథకం రద్దు చేశారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి సుమారు 16,800 రాజ్యాంగబద్ద పదవులను బీసీలకు దూరం చేశారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీల అనైన్డ్ భూములు 8వేల ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

'బీసీలకు విదేశీ విద్య, పెళ్లి కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశారు. బీసీ భవనాలను నిలిపేశారు. 26 మంది బీసీ నేతల్ని హత్య చేశారు. 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. బీసీ శవాలపైనే జగన్ రెడ్డి కుటుంబ వైభవం ప్రారంభమైంది' అని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీసీ వర్గానికి (చేనేత) చెందిన జింకా వెంకట నరసయ్యను జగన్ రెడ్డి తాత హత్య చేసి, ఆయన బైరైటీస్ గనిని దురాక్రమించుకున్నారు. జీవో నెం.217తో మత్స్యకారుల వృత్తికి ఉరితాడు బిగించారు. ఎన్‌హెచ్‌డీపీ పథకాలను రద్దు చేసి చేనేత వర్గాల వారికి కేంద్ర సబ్సిడీలు దూరం చేశారు. వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఇద్దరు బీసీలను పెట్టి వారిని సెట్ చేయాడానికి రిమోట్ కంట్రోల్‌గా తన సొంతవర్గం నేతలను నియమించారు. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి నిధులు ఇవ్వలేదు. బీసీ మంత్రులను డమ్మీలను చేసి మొత్తం జగన్ రెడ్డే అధికారం చెలాయిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని ఇలా గొంతుకోస్తుంటే బీసీ మంత్రులు నిలదీయలేని దుస్థితిలో ఉన్నారు. దారిమళ్లించిన రూ.34 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. రద్దు చేసిన బీసీ రిజర్వేషన్లు, ఆధరణ పథకాన్ని వెంటనే పునరుద్దరించాలి' అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటనలో డిమాండ్ చేశారు.

READ MORE

గుంతల రోడ్డు పథకానికి 5831 మంది బలి

Next Story

Most Viewed